Samrat Chaudhary | రేపే ప్రమాణ స్వీకారం

Samrat Chaudhary | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుత ఉపముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమయ్యారు.

బిహార్‌లో కొత్త ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌధరీ ఎంపికయ్యారు. బుధవారం ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌లో ఎన్‌డీఏకు 202 మంది సభ్యుల బలం ఉంది. అందులో 89 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించింది.

ఈ సమావేశంలో సమ్రాట్ చౌధరీ పేరును శాసనసభా పక్ష నేతగా మరో డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా ప్రతిపాదించగా, ఎమ్మెల్యేలు అందరూ ఏకగ్రీవంగా ఆయనను ఎన్నుకున్నారు. దీంతో సమ్రాట్ చౌధరీ సీఎం పదవిని చేపట్టడం ఖాయమైంది.

Leave a Reply