పాద‌చారులకు రస్నా పంపిణీ…

పాద‌చారులకు రస్నా పంపిణీ…

పాయకాపురం, ఆంధ్రప్రభ : స్థానిక పైపుల రోడ్డు, సింగ్ నగర్లో గల ఆదిత్య డిగ్రీ కళాశాల ఎన్. ఎస్. ఎస్ విద్యార్థులచే ఉచితంగా వాహనచోదకులకు, పాదచారులకు రస్నా పంపిణీ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జగదీశ్వరి మాట్లాడుతూ ప్రజలు పెరుగుతున్నఎండలకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వడ దెబ్బ తగలకుండా తరుచూ మంచినీటిని తాగాలని, కాటన్ దుస్తులు ధరించాలని ఆమె సూచించారు. ఎంతో అవసరమైన సందర్భంలో మాత్రమే మధ్యాహ్నం సమయంలో తగు జాగ్రత్తలతో బయటకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హేమంత్, ఇతర కాలేజీ ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply