వైసీపీది దళిత వ్యతిరేక పాలన

వైసీపీది దళిత వ్యతిరేక పాలన

పాయకాపురం, ఆంధ్ర ప్రభ:
వైసీపీది దళిత వ్యతిరేక పాలన సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు కార్యాలయంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో దళితులపై జరిగిన దాడులు, హత్యలు, అవమానాలు, మహిళలపై అఘాయిత్యాలు ప్రజాస్వామ్యాన్ని తలదించుకునేలా చేశాయని ఆయన తీవ్రంగా విమర్శించారు.

దళితుల సంక్షేమం పేరుతో మాటలు చెప్పిన జగన్ ప్రభుత్వం, ఆచరణలో మాత్రం దళిత వ్యతిరేక పాలన నడిపిందని మండిపడ్డారు.రాష్ట్రవ్యాప్తంగా దళితులపై దాడులు పెరిగినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. అనేక ప్రాంతాల్లో దళిత యువకులు హత్యలకు గురైనా, మహిళలపై అత్యాచారాలు జరిగినా, బాధిత కుటుంబాలకు న్యాయం చేయకుండా కేసులను నీరుగార్చే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. అధికార పార్టీ నేతల అండదండలతోనే అనేక ఘటనల్లో నిందితులు బయట తిరిగారని విమర్శించారు.డాక్టర్ సుధాకర్ ఘటన నుంచి అనేక దళిత యువకుల హత్యల వరకు రాష్ట్ర ప్రజలు అన్నింటినీ గమనించారని తెలిపారు.

Leave a Reply