పదిలో స్నిగ్ధ ప్రజ్ఞ…

పదిలో స్నిగ్ధ ప్రజ్ఞ…
పది ఫలితాల్లో విశేష ప్రతిభ
అట్కిన్సన్ కు కీర్తి తెచ్చిన సాయి స్నిగ్ధా
500 మార్కులకు 488 మార్కులు..
స్కూల్ టాపర్‌గా నిలిచిన విద్యార్థిని..
97.6 శాతం మార్కులతో ప్రతిభ..
కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం ఆనందం
విజయవాడ, ఆంధ్రప్రభ : సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అట్కియోసన్ సీనియర్ సెకండరీ స్కూల్ విద్యార్థిని కె. సాయి స్నిగ్ధా చౌదరి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాల టాపర్‌గా నిలిచింది. మొత్తం 500 మార్కులకు 488 మార్కులు సాధించి, 97.6 శాతం ఫలితాన్ని నమోదు చేసి అందరి ప్రశంసలు అందుకుంది. పాఠశాల యాజమాన్యం విద్యార్థినికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఆమె కష్టపడి చదివిన తత్వం, అంకితభావం, ప్రతిభ తమకు గర్వకారణమని పేర్కొంది.
విద్యాభ్యాసంలో నిరంతర శ్రమ, క్రమశిక్షణ, లక్ష్యసాధన పట్ల నిబద్ధతతో ఈ విజయాన్ని అందుకుందని ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల అధ్యాపకులు మాట్లాడుతూ.. విద్యార్థిని సాధించిన ఈ ఘనత ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, పాఠశాల సిబ్బంది ఆమె విజయాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
