నాదర్ గుల్ భూములపై ప్రభుత్వం స్పందించాలి

నాదర్ గుల్ భూములపై ప్రభుత్వం స్పందించాలి
- రూ.7000 కోట్ల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం
- హైకోర్టు తీర్పు బేకాతర్ చేస్తూ భూ దోపిడి
- రియల్ ఎస్టేట్ మాఫియాగా రాష్ట్ర ప్రభుత్వం
- భూములు ప్రభుత్వానివా ప్రయివేటు వా త్వరగా తేల్చండి
- మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి
- నాదర్ గుల్ సర్వే నెంబర్ 613పై అదనపు కలెక్టర్ ను కలిసిన
- బిఆర్ఏస్ ప్రతినిధి బృందం
ఆంధ్రప్రభ, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : హైకోర్టు తీర్పును బేఖాతర్ చేస్తూ రూ.7 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నా ప్రభుత్వం స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహారిస్తుందని మాజీ మంత్రి, బీ ఆర్ ఎస్ ఎల్ఫీ ఉప నేత సబిత ఇంద్రారెడ్డి విమర్శించారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ రెవిన్యూ 613 లోని 373 ఎకరాల ప్రభుత్వ భూముల అన్యకాంతం విషయంపై శుక్రవారం బీఆర్ఏస్ బృందం జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి ని కలిసి పిర్యాదు చేశారు.
బీఆర్ఏస్ జిల్లా అధ్యక్షులు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, సబిత ఇంద్రారెడ్డి,ఎమ్మెల్యే కే పి వివేకానంద, ఎమ్మెల్సీలు దాసోజు శ్రావణ్, వాణిదేవి,మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య , పట్నం నరేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ… నాదర్ గుల్ సర్వే నంబర్ 613 లో 373 ఎకరాల భూములు ప్రభుత్వానికి చెందినవని గతంలో హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని హైకోర్టు తీర్పుపై అప్పీల్ కు వెళ్తే డివిజన్ బెంచ్ సైతం అదే తీర్పు ఇచ్చిందని హైకోర్టు తీర్పును కాదని రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు కాంగ్రెస్ నేతల ప్రమేయంతో ప్రయివేటువ్యక్తులు అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు.
600 మంది రైతులు ముప్పై నలభై ఏండ్లుగా సాగుచేసుకుంటున్న భూములు బౌన్సర్లు గుండాలను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధిన మంత్రి కబ్జాలకు పాల్పడుతున్నారని రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై నేరుగా ఆరోపణలు స్పందించారు. పేదోడి పై బులడోజర్లతో విరుచుకు పడే హైడ్రా 373 ఎకరాల ప్రభుత్వ భూమి, అందులో చెరువులు కబ్జా అవుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని దీనిపై కమిషనర్ రంగనాథ్ స్పందించాలని డిమాండ్ చేశారు. నాదర్ గుల్ సర్వే నెంబర్ 613లోని 373 ఎకరాలు ప్రభుత్వ భూములని దీనిపై సుప్రీం కోర్టులో అపడవిట్ దాఖలు చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ చెప్పారని అదే విషయంలో హైడ్రా కమిషనర్ ప్రయివేటు భూమిగా పరస్పర విరుద్ధంగా చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
భూములు ప్రభుత్వానికి చెందినవా ప్రైవేట్ వ్యక్తులకు చెందినవా తెల్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతం లో ముఖ్య మంత్రులు చంద్రబాబు నాయుడు, వైస్ రాజ శేఖర్ రెడ్డి,కేసీఆర్ లు ప్రభుత్వ భూమిగా కాపాడుతూ వస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయివేటు రియల్ ఎస్టేట్ మాఫియా తో చేతులు కలిపి దోపిడీకి తెర తీశారని మంది పడ్డారు. రియల్ ఎస్టేట్ మాఫియా బౌన్సర్లు, గుండాలను పెట్టి రైతులను బెదిరించి బ్లూ షీట్స్ వేసి ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకుంటే ప్రభుత్వం నుండి కనీసం చలనం లేదని ప్రభుత్వ భూములలో కాంగ్రెస్ నాయకులు అక్రమ షెడ్లు వేస్తుంటే అధికారుల చర్యలు ఉండవా అంటూ ప్రశ్నించారు.స్థానిక ఆర్డీఓ కి పిర్యాదు చేస్తే కనీసం పట్టించుకోలేదని కలెక్టర్ ను కలిసేందుకు వస్తే కలవలేదని కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను కాపాడటానికి మరోసారి వచ్చి కలెక్టర్ ను కలుస్తామని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీఆర్ఏస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, మాజీ గ్రంధాలయ చైర్మన్ సత్తు వెంకటరమణ రెడ్డి, యాచారం మాజీ జడ్పీటీసీ రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
