Siripuram లో ఉచిత వైద్య శిబిరం
Siripuram లో ఉచిత వైద్య శిబిరం
- గ్రామస్థులకు వైద్య పరీక్షలు, చికిత్సలు
మర్పల్లి, ఆంధ్రప్రభ: మర్పల్లి మండల పరిధిలోని సిరిపురం గ్రామంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సంగీత కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో మమత హాస్పిటల్ వైద్య బృందం సేవలు అందించింది.
ఈ సందర్భంగా గ్రామస్థులకు జ్వరం, ఆస్తమా, కీళ్ల నొప్పులు తదితర ఆరోగ్య సమస్యలపై వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్సలు అందించారు. అలాగే రక్త పరీక్షలు నిర్వహించి ఆరోగ్య పరిస్థితులపై అవగాహన కల్పించారు.
సర్పంచ్ సంగీత కృష్ణారెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, మమత హాస్పిటల్ వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
