ఎండిపోయిన చెట్టును తీసేయండి మహాప్రభో..
ఎండిపోయిన చెట్టును తీసేయండి మహాప్రభో..
వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రామయ్య గూడా రోడ్డు మార్గంలో శివరాం నగర్ వద్ద భారీ చెట్టు ఎండిపోయి ఏ క్షణాన వాహదారులపై పడుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొని ఉంది. ఈ మార్గం గుండా శివరాం నగర్, ఇంద్రనగర్, రామయ్య గూడా, ఎంఐజి రామయ్య గూడా, అనంతగిరిపల్లి బుగ్గ రామలింగేశ్వర ఆలయం తదితర ప్రాంతాలకు వెళుతుంటారు. శివరాం నగర్ 31 వ వార్డులో గల ఈ చెట్టును మున్సిపల్ ఆర్ అండ్ బి అటవీశాఖ అధికారులు పరిశీలించి తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
