ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలి…
ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలి…
నచ్చన్ ఎల్లాపూర్ సర్పంచ్ బొడ్డు స్పందన
కడెం, ఆంధ్రప్రభ : మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గురుకుల పాఠశాలలో సోమవారం పర్యావరణ పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ బొడ్డు స్పందన గంగన్నఆధ్వర్యంలో పాఠశాల పరిసరాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… గ్రామం, పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
శుభ్రమైన వాతావరణం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, అందరూ స్వచ్ఛతపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సిహెచ్ శకుంతల, పంచాయితీ కార్యదర్శి శాంత, ఉపసర్పంచ్ లక్ష్మి ఆనంద్, ఈ జి ఎస్ ఎఫ్ ఏ కమలాకర్, వార్డు సభ్యులు ఉదయ్, అంబాజీ, దేవా, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు వెంకటేష్, జేఎల్ఎం వెంకటేష్, గ్రామస్తులు మధు, నారాయణ, రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
