108 pairs | యజ్ఞంలో 108 జంటలతో పాల్గొన్న దంపతులు
108 pairs | యజ్ఞంలో 108 జంటలతో పాల్గొన్న దంపతులు
- యజ్ఞంలో 108 జంటలతో పాల్గొన్న దంపతులు
108 pairs | కుంటాల, ఆంధ్రప్రభ : ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత భక్తులకు లభిస్తుందని శ్రీశ్రీశ్రీ హంపి విద్యారణ్య భారతి స్వామీజీ అన్నారు. మాఘ పౌర్ణమి పురస్కరించుకొని దత్త యజ్ఞం కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా 108 జంటలతో కూడిన దంపతులు యజ్ఞంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీశ్రీ శ్రీ హంపి విద్యారణ్య భారతి స్వామీజీ మాట్లాడుతూ… భక్తులకు ఆయన పలు ప్రవచనాలు ఇచ్చారు.
ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని, మానసిక ప్రశాంతత ఆధ్యాత్మిక చింతన సైతం ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు భక్తి భావనతో ముందుకు నడవాలని భక్తి మార్గంతోనే భక్తులకు ప్రశాంతత ఉంటుందని తెలిపారు. సనాత ధర్మం వైపు ప్రతి ఒక్కరు నడవాలని తెలియజేశారు. హిందూ సనాతధర్మం వైపు అడుగులు వేసి భక్తి మార్గంలో నడవాలని భక్తుల ఉద్దేశించి ప్రవచనాలు చేశారు. ముందుగా శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి స్వామీజీకి మహిళలు గ్రామస్తులు భజన కీర్తనలతో స్వాగతం పలికారు.

అదే విధంగా సాయంత్రం వేళలో స్థానిక ప్రధాన వీధుల గుండాల్లో శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ గ్రామంలో శోభయాత్ర చేపట్టారు. అనంతరం సిందే దత్తురాం పటేల్ భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ యొక్క యజ్ఞం కార్యక్రమానికి మండలంలోని ఆయా గ్రామాల నుండి అధిక సంఖ్యలో యజ్ఞంలో పాల్గొనడానికి జంటలతో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సుహాసిని, రవీందర్, వీడిసి అధ్యక్షులు రాజేశ్వర్, సీనియర్ న్యాయవాది ఠాగూర్, రవీందర్ సింగ్ ,లింగన్న, ముత్యం, గ్రామస్తులు ,తదితరులు పాల్గొన్నారు.



click here to read more : 1feb2026 ఆదివారం పంచాంగం | మాఘ పౌర్ణమి విశేషాలు, రాశి ఫలితాలు
