కాంగ్రెస్ కడెం మండల కార్యవర్గం ప్రకటింపు

కడెం, (ఆంధ్రప్రభ): కాంగ్రెస్ పార్టీ కడెం మండల నూతన కార్యవర్గాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు ప్రకటించినట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొడ్డు గంగన్న తెలిపారు. మండల అధ్యక్షుడిగా బొడ్డు గంగన్న కొనసాగగా, ఉపాధ్యక్షులుగా పడిగల రాజు, ఎం.డి. మహబూబ్ ఖాన్, బండారి శంకర్, దాసు నాయక్, మాలవత్ బత్తుల వెంకటేష్, ప్రధాన కార్యదర్శులుగా ముడికే మల్లేష్ యాదవ్, ముస్కు రాజేందర్ రెడ్డి, అధికార ప్రతినిధిగా (స్పోక్స్‌పర్సన్) దీకొండ విజయ్ కుమార్, కోశాధికారిగా కొండాపురం లక్ష్మణ్‌తో పాటు కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులను నియమించారు.

అలాగే ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడిగా జడ రాజేశ్వర్, మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా మొహమ్మద్ సలీం, బీసీ సెల్ అధ్యక్షుడిగా ముంజం ప్రసాద్ గౌడ్, ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా తోడసం సీతారాం, మహిళా విభాగం మండల అధ్యక్షురాలిగా బోయిని మంగ, కిసాన్ సెల్ అధ్యక్షుడిగా ఎన్. నరేందర్ రెడ్డిని నియమించారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులకు బొడ్డు గంగన్న శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేసి పార్టీ నాయకత్వం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు.