Dead Line Tension : ఇక అమీతుమీ Andhra Prabha TOP Story

Dead Line Tension : ఇక అమీతుమీ Andhra Prabha TOP Story

  • శరణమా? యుద్ధమా?
  • మధ్య ప్రాచ్యంలో టెన్షన్​ టెన్షన్​
  • ఇటు ట్రంప్​ వార్నింగ్​
  • అటు ఇరాన్​ బేఖాతరు
  • దాడులు.. ప్రతిదాడులు
  • హోర్ముజ్​ చుట్టూ రాజకీయం

( ఆంధ్రప్రభ, వాషింగ్టన్​ ప్రతినిధి)

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు.. యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి
కోహ్గిలుయేలో క్షిపణి దాడి.. మృతులు, గాయాలు
మాహ్‌షహర్ పెట్రోకెమికల్ జోన్‌పై వైమానిక దాడులు
విద్యాసంస్థలు, ఆసుపత్రులపై దాడులు.. ఆందోళన
పౌర ప్రాంతాలు కూడా లక్ష్యం.. పెరుగుతున్న నష్టం
ఇరాన్ ప్రతిదాడి.. అమెరికా విమానాలు కూల్చివేత ప్రకటన
ఇస్ఫాహాన్‌లో సంయుక్త ఆపరేషన్ వివరాలు
ట్రంప్ అల్టిమేటమ్.. హార్ముజ్ జలసంధిపై ఉద్రిక్తత
“నరకం కురుస్తుంది” vs “నరక ద్వారాలు తెరిచాం” మాటల యుద్ధం
పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం మరింత తీవ్రం

( ఆంధ్రప్రభ . వాష్టింగ్టన్​ ప్రతినిధి)

Dead Line Tension

అటు అమెరికా ఇజ్రాయెల్ ఆప‌రేష‌న్ ప్యూరీ.. ఇటు ఇరాన్ ప్ర‌తి దాడితో… మ‌ధ్య ప్రాచ్యం అల్లాడిపోతోంది. ఇరాన్ ను న‌ర‌కం చూపించ‌టానికి అమెరికా గ‌డువులు మీద గ‌డువులు విధిస్తుంటే… ఇవిగో న‌రకం ద్వారాలు అంటూ ఇరాన్ గ‌ల్ఫ్ దేశాల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. ఏకంగా ప‌శ్చిమ ఆసియా అల్ల‌క‌ల్లోలమ‌వుతోంది. ఇరాన్ లోని విద్యాసంస్థ‌లు, అణువిద్యుత్తు కేంద్రాలు, ఆయిల్ కంపెనీల‌పై అమెరికా, ఇజ్రాయెల్ క్షిప‌ణులతో దాడి చేశాయి. ఇరాన్‌లోని కోహ్గిలుయేపై క్షిప‌ణుల దాడిలో ముగ్గురు మృతి చెండారు. ఇద్దరు గాయపడ్డారు.నల్ల పర్వతంపై ఈ దాడి జ‌రిగింది. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని కోహ్గిలుయే గవర్నర్ తెలిపారు.

Dead Line Tension అమెరికా దూకుడు

Dead Line Tension

ఇరాన్ నైరుతి ప్రాంతంలోని వ్యూహాత్మక మాహ్‌షహర్ పెట్రోకెమికల్ ప్రత్యేక ఆర్థిక జోన్‌పై అమెరికా ఇజ్రాయెల్ దళాల‌ వైమానిక దాడుల్లో కనీసం ఐదుగురు దుర్మ‌ర‌ణం చెందారు. సుమారు 170 మందికి పైగా గాయపడ్డారు, మాహ్‌షహర్ జోన్‌లోని మూడు ప్రధాన కంపెనీల ప్రాంగణాలపై ఈ దాడులు జరిగాయి. బందర్ ఇమామ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఫజ్ర్ 1 , ఫజ్ర్ 2 కంపెనీలు ఉన్నాయి.

Dead Line Tension ఆంబులెన్సులూ టార్గెట్టే

Dead Line Tension

కేవలం పారిశ్రామిక కేంద్రాలే కాకుండా, జ‌న‌వాసాల‌పై కూడా దాడులు పెరిగాయని అంతర్జాతీయ నివేదికలు పేర్కొంటున్నాయి: టెహ్రాన్‌లోని ప్ర‌తిష్టాత్మక షాహిద్ బెహెష్తీ యూనివర్సిటీ (Shahid Beheshti University) లోని లేజర్ అండ్ ప్లాస్మా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌పై దాడులు జరిగాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 30కి పైగా విశ్వవిద్యాలయాలు ప్రభావితమయ్యాయని సమాచారం. టెహ్రాన్‌లోని ఒక సైకియాట్రిక్ హాస్పిటల్ పాశ్చర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇరాన్ సమీపంలో దాడులు జ‌రిగాయి. ఆసుప‌త్రి భవనాలు దెబ్బతిన్నాయి.

Dead Line Tension ఇరాన్​ ప్రతి దాడి

Dead Line Tension

ఇరాన్ లోని కోహ్గిలుయే, బోయెర్-అహ్మద్ (Kohgiluyeh and Boyer-Ahmad) ప్రావిన్స్‌లోని కఠిన పర్వత ప్రాంతంలో కూలిన అమెరికా F-15E స్ట్ర‌యిక్ ఈగిల్ యుద్ధ విమానం ఫైల‌ట్ కోసం తాము చేప‌ట్టిన రెస్య్కూ ఆప‌రేష‌ప్ స‌క్కెస్ కావ‌టంతో పెంట‌గాన్ అధికారులు సంబ‌రం చేస్తున్న త‌రుణంలో.. ఇరాన్ మ‌రో చావు దెబ్బ క‌బురు చెప్పింది. రెండు సీ-130 (C-130) రవాణా విమానాలు, రెండు బ్లాక్ హాక్ (Black Hawk) హెలికాప్టర్ల‌ను కూల్చిన‌ట్టు ఇరాన్ ప్ర‌క‌టిచింది. దక్షిణ ఇస్ఫాహాన్ (Southern Isfahan) ప్రావిన్స్‌లో వీటిని ధ్వంసం చేసిన‌ట్టు ఇరాన్ సైన్యం ప్రకటించింది. ఈ విమానాలు ఇస్ఫాహాన్ నగరం నుంచి ఆగ్నేయం దిశ‌లో (Southeast of Isfahan City) 50 కిలోమీటర్ల దూరంలోని ఒక పాత విమానాశ్రయం ప్రాంతంలో ధ్వంసం చేసిన‌ట్టు ఇరాన్ సైన్యం వివ‌రించింది. తమ వైమానిక దళం (IRGC Aerospace), , పదాతి దళం స‌హా స్థానిక గిరిజన యోధులు జరిపిన జాయింట్ ఆపరేషన్‌లో ఈ విమానాలను కూల్చివేసినట్లు ఇరాన్ సైనిక ప్రతినిధి ఇబ్రహీం జొల్ఫాఘరి తెలిపారు.

Dead Line Tension ఇక నరకమే : అమెరికా

Dead Line Tension

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 48 గంటల అల్టిమేటమ్‌ను ఇరాన్ సైనిక నాయకత్వం తీవ్రంగా ఖండించింది. స్సహాయ, అసమతుల్య మూర్ఖపు చర్య గా అభివర్ణించింది. ఏప్రిల్ 6, 2026 రాత్రి 8 గంటల (Eastern Time) లోపు ఇరాన్ శాంతి ఒప్పందానికి రావాలని లేదా వ్యూహాత్మక హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవాలని ట్రంప్ గడువు విధించారు. లేనిపక్షంలో ఇరాన్‌పై “నరకం కురుస్తుంది” (all hell will rain down) అని, ముఖ్యంగా ఇంధన ప్లాంట్లను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.

Dead Line Tension నరకం తలుపులు తెరిచాం : ఇరాన్​

Dead Line Tension

ఇరాన్ సెంట్రల్ మిలిటరీ కమాండ్ ప్రతినిధి జనరల్ అలీ అబ్దొల్లాహి అలీఅబాదీ ఈ హెచ్చరికను తోసిపుచ్చుతూ, అమెరికా అధ్యక్షుడు వరుస ఓటములతో ఇటువంటి “నిస్సహాయ ” వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఒకవేళ అమెరికా దాడులకు దిగితే, ప్రతిగా తమ శత్రువుల కోసం “నరకపు ద్వారాలు తెరుచుకుంటాయి” అని ఎదురుదాడి చేశారు.

ALSO READ : 25 Dead Iran Airstrike : ఇరాన్‌పై వైమానిక దాడి Andhra Prabha News