6to7Hours | వేసవి ట్రిప్స్‌లో స్కిన్ కేర్ ఇలా… సింపుల్ టిప్స్

6to7Hours | వేసవి ట్రిప్స్‌లో స్కిన్ కేర్ ఇలా… సింపుల్ టిప్స్

6to7Hours | వేసవి ప్రయాణాల్లో చర్మ సమస్యలు ఎందుకు?
సన్‌స్క్రీన్ నుంచి నిద్ర వరకు ముఖ్య సూచనలు
ఫోటోల్లో ఫ్రెష్ లుక్ కోసం చిట్కాలు

6to7Hours | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : వేసవి అంటే ఒకవైపు మండే ఎండలు, మరోవైపు హాలిడే ట్రిప్స్. స్కూల్ సెలవులు, ఆఫీస్ బ్రేక్స్, కుటుంబంతో కలిసి బయటకు వెళ్లే ప్లాన్లు… ఇవన్నీ ఈ సీజన్‌కే ప్రత్యేకం. “ఈసారి ఎక్కడికి వెళ్లాలి?” అనే ఉత్సాహం ఎంత ఉంటుందో, “ప్రయాణంలో నా స్కిన్ ఎలా ఉంటుంది?” అనే ఆందోళన కూడా ముఖ్యంగా, మహిళల్లో అంతే ఎక్కువగా ఉంటుంది.

6to7Hours

టూర్ అంటే కొత్త ప్రదేశాలు, కొత్త వాతావరణం, కొత్త నీరు, కొత్త ఆహారం. ఈ మార్పులన్నింటినీ శరీరం ఎంతవరకు తట్టుకుంటుందో, చర్మం కూడా అంతే సున్నితంగా స్పందిస్తుంది. ఎంతో ఉత్సాహంగా ట్రిప్‌లో తీసుకున్న సెల్ఫీలు, ఫోటోలు తర్వాత చూసుకున్నప్పుడు “అయ్యో… నేనిలా పడ్డానేంటి!” అనిపించే సందర్భాలు చాలా మందికి ఉంటాయి. చర్మం నల్లబడడం, ముఖం జిడ్డుగా కనిపించడం, వేడి కురుపులు రావడం, మొటిమలు పెరగడం, పెదవులు ఎండిపోవడం… ఇవన్నీ వేసవి ప్రయాణాల్లో సాధారణంగా ఎదురయ్యే సమస్యలే.

అయితే కొంచెం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ట్రిప్‌ను కూడా ఎంజాయ్ చేయొచ్చు, చర్మ సౌందర్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ఫోటోల్లో ఫ్రెష్‌గా, గ్లోయింగ్‌గా కనిపించాలంటే కొన్ని చిన్న అలవాట్లు చాలా పెద్ద మార్పు తీసుకువస్తాయి.

6to7Hours | సన్‌స్క్రీన్… ఇది ఆప్షన్ కాదు, తప్పనిసరి

6to7Hours

వేసవి ప్రయాణాల్లో మొదట గుర్తు పెట్టుకోవాల్సింది సన్‌స్క్రీన్. చాలా మంది బీచ్‌కు వెళ్లినప్పుడు మాత్రమే దీనిని ఉపయోగిస్తారు. కానీ సాధారణ ట్రావెల్‌కైనా సూర్యకిరణాల ప్రభావం చర్మంపై తీవ్రంగా ఉంటుంది. అంట్రా వయలెట్ కిరణాలు సున్నితమైన చర్మాన్ని నల్లబరచడమే కాకుండా, ముందస్తు ముడతలకు కూడా కారణమవుతాయి.

ఎస్ పీ ఎఫ్ 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న బ్రాడ్ స్పెక్ట్రం సన్‌స్క్రీన్‌ను బయటకు వెళ్లే 20 నిమిషాల ముందు అప్లై చేయాలి. ప్రతి 2 నుంచి 3 గంటలకు ఒకసారి మళ్లీ రాయడం మంచిది. కేవలం ముఖానికే కాదు… మెడ, చేతులు, కాళ్లు కూడా మర్చిపోవద్దు.

6to7Hours | నీరు తక్కువైతే… గ్లో కూడా తగ్గిపోతుంది

6to7Hours

ప్రయాణాల్లో ఎక్కువగా బయట తిరగడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. నీరు తక్కువగా తాగితే ముఖం మసక బారినట్టుగా కనిపిస్తుంది. చర్మం పొడిబారుతుంది. కొన్నిసార్లు జిడ్డుగా కూడా మారుతుంది. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగడం అవసరం. కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం, ఫ్రెష్ జ్యూసులు కూడా ఉపయోగకరం. చల్లని కార్బొనేటెడ్ డ్రింక్స్ కంటే సహజ ద్రవాలు మంచివి.

6to7Hours | ఫుడ్‌లో జాగ్రత్త… స్కిన్‌కూ ప్రభావం

6to7Hours

ట్రిప్ అంటే బయట ఆహారం తప్పదు. కానీ ఆయిల్ ఎక్కువగా ఉన్న ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ఎక్కువ మసాలా పదార్థాలు తినడం వల్ల మొటిమలు, చర్మ అలర్జీలు రావచ్చు. ముఖ్యంగా వేడి కాలంలో శరీరం త్వరగా స్పందిస్తుంది. అందుకే వీలైనంత వరకు తేలికపాటి ఆహారం, ఫ్రూట్స్, పెరుగు, సలాడ్స్ తీసుకోవడం మంచిది. కొత్త ప్రదేశాల్లో నీటి విషయంలో కూడా జాగ్రత్త అవసరం. పరిశుభ్రమైన బాటిల్ వాటర్ మాత్రమే ఉపయోగించడం ఉత్తమం.

6to7Hours | మేకప్ తక్కువగా… కంఫర్ట్ ఎక్కువగా

6to7Hours

హెవీ మేకప్ వేసవి ప్రయాణాల్లో ఎక్కువసేపు నిలవదు. పైగా చెమటతో కలసి చర్మ రంధ్రాలను మూసేసి మొటిమలకు దారి తీస్తుంది. అందుకే లైట్ మేకప్, టింటెడ్ మాయిశ్చరైజర్, లిప్ బామ్, వాటర్‌ప్రూఫ్ మస్కారా వంటి మినిమల్ ప్రొడక్ట్స్‌నే ఉపయోగించడం మంచిది. రాత్రి నిద్రపోయే ముందు మేకప్ పూర్తిగా తొలగించడం చాలా ముఖ్యం. లేకపోతే మరుసటి రోజు ముఖం అలసిపోయినట్టుగా కనిపిస్తుంది.

6to7Hours | స్కిన్ కేర్ కిట్ చిన్నదైనా… ఉపయోగం పెద్దది

6to7Hours

ట్రావెల్ బ్యాగ్‌లో చిన్న స్కిన్ కేర్ కిట్ తప్పనిసరిగా ఉండాలి. ఫేస్‌వాష్, మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్, వెట్ వైప్స్, లిప్ బామ్, ఫేస్ మిస్ట్ వంటి బేసిక్ వస్తువులు ఉంటే చాలానే సమస్యలు దూరమవుతాయి. ప్రతి చోట కొత్త ప్రొడక్ట్స్ ప్రయత్నించడం కంటే, మీ చర్మానికి అలవాటు అయిన వాటినే వెంట తీసుకెళ్లడం సురక్షితం.

6to7Hours | నిద్ర కూడా అందానికే భాగం

6to7Hours

చాలామంది ట్రిప్‌లో నిద్రను పూర్తిగా మర్చిపోతారు. రాత్రంతా ప్రయాణం, తెల్లవారుజామున లేచే ప్లాన్‌లు… ఇవన్నీ ముఖంపై వెంటనే కనిపిస్తాయి. కళ్ల కింద నల్లటి వలయాలు, అలసట, నిర్జీవంగా కనిపించే చర్మం—ఇవి నిద్రలేమి సంకేతాలు. కాబట్టి కనీసం 6 నుంచి 7 గంటల విశ్రాంతి అవసరం. మంచి నిద్రే సహజమైన గ్లోకు మూలం.

6to7Hours | ఫోటోల్లో మెరవాలంటే… ఆత్మవిశ్వాసం కూడా ముఖ్యం

6to7Hours

చర్మ సౌందర్యం అంటే కేవలం క్రీములు కాదు. మనలోని ఆత్మవిశ్వాసం కూడా ముఖంపై కనిపిస్తుంది. ట్రిప్‌లో ప్రతి ఫోటో “పర్ఫెక్ట్” కావాల్సిన అవసరం లేదు. సంతోషంగా ఉన్న క్షణం అందంగా కనిపిస్తుంది. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ, మనసారా ట్రిప్‌ను ఆస్వాదిస్తే అదే అసలైన గ్లో. సెల్ఫీల్లో ఫిల్టర్ కంటే సహజమైన చిరునవ్వే ఎక్కువ అందంగా కనిపిస్తుంది.

వేసవి ట్రిప్స్ అంటే కేవలం ప్రయాణం కాదు… గుర్తుండిపోయే జ్ఞాపకాలు. ఆ జ్ఞాపకాలతో పాటు మీ ముఖారవిందం కూడా మెరిసిపోవాలంటే, ఈ సింపుల్ స్కిన్ కేర్ టిప్స్ తప్పకుండా పాటించండి. ప్రయాణం ఎంజాయ్ చేయండి… ఫోటోల్లో మెరిసిపోండి.

click here to read జిడ్డు తగ్గించే సింపుల్ టిప్స్..

click here to read more