ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీ
గట్టుప్పల, ఆంధ్రప్రభ : గట్టుప్పల మండలంలోఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను బాధితులకు శుక్రవారం పంపిణీ చేశారు.వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది ఖర్చుల నిమిత్తము ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా మండలంలోని నామాపురం 4,వెల్మకన్నె 3,శేర్ గూడెం 3,తేరటుపల్లి 7,గట్టుప్పల 11,అంతపేట 9,కమ్మగూడెం 1 గ్రామాలకు చెందిన బాధితులకు సుమారు రూ.12,17,500 రూపాయల చెక్కులను కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచ్ నామని జగన్నాథం,జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు దండు యాదగిరి రెడ్డి తో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ సింగం వెంకటేశం,భీమనపల్లి రామయ్య,చందా శ్రీలత వెంకటేశం,మార్కెట్ కమిటీ డైరెక్టర్ మోదుగు బాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కంచుకట్ల సంపత్, ఉపసర్పంచ్ ఖమ్మం లక్ష్మయ్య,దోర్నాల అంజయ్య,చలమల్ల వెంకటరమణారెడ్డి,నామని బుచ్చయ్య,భీమగాని మల్లేశం, దోర్నాల భరత్,చెరుపల్లి ఆంజనేయులు,వార్డు సభ్యులు పెదగాని నరేందర్,చెరిపెల్లి వెంకటేశం,పున్న శివ,గంజి వెంకటేశం,రావుల పర్వతాలు,పగిళ్ల యాదయ్య,గిరి శంకర్,బెదరకోట శ్రీనివాస్,మద్ది రమేష్ జాజుల యాదయ్య,భీమనపల్లి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
