నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం లోని లింగంపల్లి గ్రామంలోనూతనం గా నిర్మించిన రామాలయం లో నేటి నుండి బ్రహ్మశ్రీ వెంకట్ నారాయణ శర్మ ఆధ్వర్యంలో సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రస్వామి సహిత మహాగణపతి సుబ్రహ్మణ్య ఆదిత్యాదిన నవగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమం మొదలైంది.. ఈ ఉత్సవాల్లో భాగంగా ముందుగా పండితుల వేదమంత్రాలతో గ్రామ ప్రదక్షణ గోపూజ యాగశాల ప్రదక్షణ అలాగే గణపతి పూజ పుణ్యాహవాచనము అంకురారోపణ పంచగవ్యప్రాసన కార్యక్రమముతో ప్రతిష్టా కార్యక్రమం దిగ్విజయముగా ప్రారంభమైంది.

ఈ కార్యక్రమంలో మొదటిరోజు బ్రాహ్మణులకు దీక్షాధారణ అగ్ని ప్రతిష్టాపన మొదలగు కార్యక్రమాలు జరుగుతాయి అని వేదపండితులు తెలియజేసారు రెండవ రోజు సర్వతోభద్ర మండపము నవగ్రహ మండపము క్షేత్రపాలక మండపము యోగినీమండముతో మండప ఆరాధన కలశస్థాపన పురుష సూక్త శ్రీ సూక్త భవనాలు జరుగునని మూడవరోజు క్షీరాధివాసం జలాధివాసము మండపమున పూజ మున్నగో కార్యక్రమంలో జరుగును. నాల్గవ రోజు పుష్పాదివాసము ధాన్యాధివాసము షైయాధివాసము విగ్రహమూర్తుల గ్రామ ప్రదక్షణ స్వామి వారికి నీరాజనం కార్యక్రమాలు జరుగునని తెలిపారు. ముగింపు రోజు అయిదవరోజు ఉదయం ఎనిమిది గంటల 45 నిమిషాలకు యంత్ర ప్రతిష్ట విగ్రహమూర్తుల ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ట విగ్రహ కళాన్యాసము మొదలగు కార్యక్రమాలు జరుగును. అటు పిమ్మట సీతారాముల వారి విశేష కళ్యాణ మహోత్సవం జరుగునని అనంతరం స్వామివారి పల్లకి సేవ మంత్రపుష్పము తీర్థప్రసాదాలతో మరియు మహా అన్నదానముతో యాగం పూర్తవుంతుంది అని వారు తెలిపారు. ఈ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని
పండితులు, గ్రామ పెద్దలు కోరారు..
