ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం….

చిట్యాల, ఆంధ్రప్రభ : ఆర్టీసీలో ప్రయాణం సురక్షితమని ప్రజలు సద్వి నియోగం చేసుకోవాలని, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శుక్రవారం మండలంలోని చింతకుంట రామయ్య పల్లి లో గ్రామ సర్పంచ్ మటిక, సుజాత-రవీందర్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సు ప్రారంభించారు. బస్సు, సి ఆర్ పల్లి , కైలాపురం, చిట్యాల నుండి పరకాల కు చేరుకుంటుందన్నారు.
అనంతరం ఎమ్మెల్యే జి ఎస్ ఆర్ మాట్లాడుతూ, ప్రజాపాలన ప్రభుత్వం మహిళలకు ఉచితంగా బస్సు ప్రవేశపెట్టి ఆదర్శంగా నిలిచిందన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో పరకాల మేనేజర్ రాంప్రసాద్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు గుట్ల తిరుపతి, నాయకులు కామిడీ రత్నాకర్ రెడ్డి, పులి తిరుపతిరెడ్డి, ఎన్ సంపత్ రావు, బుర్ర శ్రీనివాస్, గడ్డం కొమురయ్య, అల్ల కొండ కుమార్, కట్కూరి నరేందర్ ,గంగాధరి రవీందర్, పుల్లూరి సతీష్, నైన్ పాక, ఏఆర్ పల్లి ,సర్పంచులు నక్క భాస్కర్, కొడారి అశోక్, గ్రామస్తులు,గోపగాని కొమురయ్య, రాయ కొమురు , శ్రీకాంత్ సాంబయ్య, రవీందర్, వల్లకొండ సమ్మిరెడ్డి, పర్లపల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
