పేదింటి విద్యార్థినికి సంఘమిత్ర చేయూత

ఆలేరు, ఆంధ్రప్రభ : సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో ఆలేరు పట్టణంలోని ప్రగతి స్కూల్ లో 7వ తరగతి చదువుతున్న బి అక్షయ పేదరికంతో ఫీజు కట్టలేని పరిస్థితిని తెలుసుకొని తన చదువు ఆగిపోవద్దని ఉద్దేశంతో 8వ వార్డు కౌన్సిలర్, సంఘమిత్ర సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొట్ల సంపత్ ముందుకు వచ్చి విద్యార్థిని ఫీజును చెల్లించారు. ఈ సందర్భంగా విద్యార్థిని నానమ్మ సంఘమిత్ర సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. చదువులో విద్యార్థినికి సహకరిస్తున్న స్కూలు యాజమాన్యానికి కౌన్సిలర్ సంపత్ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కంతుల శంకర్,పట్టణ ఆర్గనైజింగ్ సెక్రటరీ వడ్డేమాన్ నరేందర్, బింగి భాను, కటకం నవీన్, సుంకరి సృజన్ పాల్గొన్నారు.

Leave a Reply