ఊరు, వాడ అభివృద్ధే గ్రామ సభల లక్ష్యం

ఊరు, వాడ అభివృద్ధే గ్రామ సభల లక్ష్యం
- కోమటిగూడెం సర్పంచ్ పనికర సోమయ్య
స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ : గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం గ్రామ సభలు కీలక వేదికలుగా నిలు స్తాయని సర్పంచ్ పనికర సోమయ్య పేర్కొన్నారు. 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం స్టేషన్ ఘన్పూర్ మండ లం కోమటిగూడెం గ్రామంలో ఆయన అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక, గ్రామాభివృద్ధికి అవసరమైన అంశాలపై విస్తృతంగా చర్చించారు. గ్రామంలో ఉన్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కార మార్గాలపై ప్రజల అభిప్రాయాలను సేకరించారు.
పథకాల అమల్లో పారదర్శకత పెంపుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా వివరించారు. అనంతరం సర్పంచ్ సోమయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా గ్రామ సభలు వేదిక కావాలని అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ సేవల విస్తరణ, రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, మహిళా సాధికారత వంటి పథకాలను ప్రభు త్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు.
99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ కరుణాకర్, పంచాయతీ కార్యదర్శి మహేందర్, ఉప సర్పంచ్ బోయిని రవి, వార్డ్ సభ్యులు, గ్రామ యువ కులు, మహిళలు, పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొని గ్రామ సభను విజయవంతం చేశారు.
