మురుగు కాలువల శుభ్రత పనులు

మురుగు కాలువల శుభ్రత పనులు

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ:
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ సర్పంచ్ లావణ్య శేషు ఆధ్వర్యంలో సోమవారం రోజున మురుగు కాలువల శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. వర్షాకాలం నేపథ్యంలో నీరు నిల్వ ఉండకుండా, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా ప్రోక్లైనర్ తోమురుగు కాలువలను శుభ్రం చేశారు.

గ్రామసర్పంచ్ మునిగడప లావణ్య శేషు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ పర్యవేక్షణలో గ్రామంలోని పలు వార్డుల్లో ఉన్న కాలువలలో పేరుకుపోయిన డ్రైనేజీ, చెత్త, మట్టి , ఇతర వ్యర్థాలను తొలగించారు. గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు.

సర్పంచ్ మునిగడప లావణ్య మాట్లాడుతూ మురుగు కాలువలశుభ్రత పనులుచేపట్టడం వల్ల దోమలు, వ్యాధుల వ్యాప్తి తగ్గడంతో పాటు వర్షపునీరు సాఫీగా వెళ్లేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వార్డ్ మెంబర్లు జన్నారపు వెంకటేష్, వేముల నవీన్, కొత్తకొండ అజయ్, కారొబార్ లక్ష్మణ్, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply