ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం…
ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం…
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
జన్నారం, ఆంధ్రప్రభ : ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పని చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంచిర్యాల జిల్లా జిల్లా జన్నారం మండల కేంద్రంలోని ఎంపీడీవో సమావేశ మందిరంలో బుధవారం మధ్యాహ్నం కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పేద ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటుందన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల బిల్లులో, కళ్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులలో ఎవరికి డబ్బులు ఇవ్వనవసరం లేదని,ఎవరైనా డబ్బులు అడిగినట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. ప్రజలు నేరుగా తన వద్దకు వచ్చి సమస్యలను చెప్పుకున్నట్లయితే వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి వెనువెంటనే తీర్చడానికి ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు దుర్గం లక్ష్మీనారాయణ స్థానిక ఇన్చార్జి తాహసిల్దార్ నేరెళ్ల రామ్మోహన్, ఎంపీడీవో హుమర్ షరీఫ్, ఎంఆర్ఐ గంగరాజు, మాజీ జెడ్పిటిసి సభ్యుడు ఎర్ర చంద్రశేఖర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముజఫర్, మాణిక్యం, తదితరులు పాల్గొన్నారు.
