ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి విరాళం…

ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి విరాళం…
కడెం, ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన కడెంలోని సీతా రామచంద్రస్వామి సహిత శివాలయం ఆంజనేయ ఆలయ నిర్మాణానికి గాను కడెంకు చెందిన నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఉద్యోగి పల్లెర్ల లక్ష్మి సత్యక్క 51 వేల 16 రూపాయలు నగదు చందా రూపంలో ఇచ్చారు.
51 వేల రూపాయలు ఆలయ నిర్మాణానికి అందజేసిన పై ఉద్యోగికి వారి వంశానికి ఆ భగవంతుడు కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని రామ మందిరం పై మమకారంతో కొండంత సహకారం అందించి ఆలయ అభివృద్ధికి మీ సహకారం ఎంతో బలాన్ని చేకూర్చిందని సీతారామచంద్ర స్వామి వారి కృపా కటాక్షాలు మీపై మీ కుటుంబం పై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కడం సీతారామ సీతారామాలయం ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గడప దేవరాజ్, ఆలయ కమిటీ సభ్యులు ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
