అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో చేర్చాలి
- మాజీ ఎంపీపీ అమ్మి బాపూరావు
కడెం, ఆంధ్రప్రభ : అర్హులైన ప్రతి ఒక్కరి పేరును ఓటరు జాబితాలో నమోదు చేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కడెం మండల మాజీ ఎంపీపీ భూక్య అమ్మి బాపూరావు అన్నారు.
కడెం మండలంలోని లక్ష్మీసాగర్ గ్రామంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఓటరు పరిశీలన కార్యక్రమంలో బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్య జాన్సన్ నాయక్, కడెం మండల అధ్యక్షుడు నల్ల జీవన్‌రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం ఇంటింటా సర్వే నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక బీఎల్ఓ గోదూరి గంగామణితో కలిసి మాజీ ఎంపీపీ భూక్య అమ్మి బాపూరావు పాల్గొని గ్రామంలోని ఓటర్ల వివరాలను పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా అమ్మి బాపూరావు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి ఓటు ఎంతో విలువైనదని, అర్హత ఉన్న ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు.
