డాక్టర్ విజయపాల్ రెడ్డిని సన్మానించిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణంలోని ప్రముఖ వైద్యులు పింగిళి విజయపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ నూతన కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం రోజు పరకాల పట్టణoలోని ప్రముఖ వైద్యులు పింగిళి విజయపాల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు 19 వ వార్డు కౌన్సిలర్ కొయ్యడ శ్రీనివాస్ తోపాటుగా స్థానిక 21 వ వార్డు కౌన్సిలర్ సుదమల్ల రమేష్, కౌన్సిలర్ బండి శ్రీధర్ లు కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు ఒంటేరు శ్రావణ్ కుమార్,ఐలిపెళ్లి స్వామి,బండి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply