గ్రామ పంచాయతి నిధులు దుర్వినియోగం

గ్రామ పంచాయతి నిధులు దుర్వినియోగం

నడికూడ, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతిలో గ్రామ కార్యదర్శిగా పని చేస్తున్నా సాయిని బిక్షపతి పంచాయతి సర్పంచ్ ఎన్నికలు జరిగి 6 నెలలు గడుస్తూన్నా ఇప్పటి వరకు సాదరణ గ్రామ సభ నిర్వహించ లేదు. గ్రామ సభ గురించి వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, ఎప్పుడు గ్రామ పంచాయతి నిధుల గురించి అడిగినా సమాధానం దాటవేస్తూ, మభ్యుపెడుతూ వస్తూన్నాడు. నడికూడ పంచాయతి, నల్లా బిల్లులు, ఇంటి పన్నులు వసూలు చేసిన రూపాయలు, 4, 65, 218 తన స్వంత ప్రయోజనాలకు వాడుకుంటూ నడికూడి గ్రామమునకు మంజూరైన బిల్లులు, పని చేయకుండానే నకిలి బిల్లులు పెట్టి బిల్లులు డ్రా చేసుకుని లెక్కలు చెప్పడం లేదు.

పని చేయకుండానే డ్రా చేసిన బిల్లుల వివరాలు:- 21-05- 2026న నర్సరి విత్తనాల పై 45,200, L.E.D. లైట్లపై, 100, 556, బతుకమ్మ ఖర్చులపై 1. 15,000, ఎలెక్టెడ్ నెంబర్స్ ఎలక్షన్ 161, 450, డిజిల్, బ్లీచింగ్ పౌడర్స్ 255,959, బ్లీచింగ్ బ్యాగ్స్ 56, 7593, పైపులైన్ లికేజిలపై-50,800, సిబ్బంది జీతాలు 19,000 , డోజర్ 72,0870, మోటర్ రిపేర్ల పై 1,61, 570 అని మొత్తం రూపాయలు డ్రా చేసి, నిధుల దుర్వినియోగానికి పాల్పడుతూ నడికూడ గ్రామ ప్రజలను మోసం చేస్తున్నాడు. ఈ బిల్లుల పై చట్ట పరమైన ఎంక్వైరీ చేయించి నిధులను స్వాధీన పరుచుకొని గ్రామ పంచాయతి అభివృద్ధికి కేటాయించాలని, ఇతన్ని వెంటనే ఇక్కడి నుండి బదిలి చేసి కొత్త కార్యదర్శిని నియమించాలని వార్డు సభ్యులు, ప్రజలు కోరుతున్నారు.