కౌశిక్ రెడ్డిపై స్పీకర్ తక్షణమే చర్యలు తీసుకోవాలి

కౌశిక్ రెడ్డిపై స్పీకర్ తక్షణమే చర్యలు తీసుకోవాలి

  • మండల ప్రధాన కార్యదర్శి కావటి భాస్కర్ యాదవ్

రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ అసెంబ్లీలో మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతున్న సమయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరు పూర్తిగా అనుచితమని, కౌశిక్ రెడ్డి పై స్పీకర్ తక్షణమే చర్యలు తీసుకోవాలి రఘునాథపల్లి మండల ప్రధాన కార్యదర్శి కావటి భాస్కర్ యాదవ్ అన్నారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ…అసెంబ్లీ వంటి గౌరవప్రదమైన సభలో గన్‌తో కాల్చేస్తానని సూచించేలా సైగలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధ మని అన్నారు. కడియం శ్రీహరి వంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కేవలం వ్యక్తిగత అవమానం మాత్రమే కాకుండా, దళిత సమాజాన్ని అవమానించినట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెంటనే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే కడియం శ్రీహరికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అసెంబ్లీ స్పీకర్ తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave a Reply