నాలుగు గ్రామాల్లో ఈగల్ టీం పోలీసుల అవగాహన

నాలుగు గ్రామాల్లో ఈగల్ టీం పోలీసుల అవగాహన

ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ ఈగల్ టీం పోలీస్ ఉన్నతాధికారులు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని నాలుగు గ్రామాల్లో అవగాహన కల్పించేందుకు సోమవారం ఉదయం 9:30 నుండి సాయంత్రం ఐదు గంటల వరకు హాజరుకానున్నట్లు ఊట్కూర్ ఎస్సై రమేష్ తెలిపారు.

మండలంలోని పెద్దజట్రం, బిజ్వార్, ఊట్కూర్, చిన్నపొర్ల గ్రామాల్లో హైదరాబాద్ నుండి వచ్చిన మాదకద్రవ్యాలు డ్రగ్స్ అరికట్టేందుకు పిల్లల భద్రత పై అవగాహన కల్పించేందుకు రానున్నట్టు పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు విద్యార్థులు గ్రామస్తులు కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని ఎస్ఐ కోరారు.

Leave a Reply