మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతికి ఘన సన్మానం

మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతికి ఘన సన్మానం

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం మున్నూరు కాపు సంఘం నియోజకవర్గ విభాగం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి – రమేష్ , 6వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ సల్లా కృష్ణవేణిలను ఘనంగా సన్మానించారు. పట్టణ అభివృద్ధికి, సామాజిక సేవా కార్యక్రమాలకు వారు అందిస్తున్న సహకారానికి గుర్తింపుగా ఆ సంఘం నాయకులు వారిని శాలువాలతో సత్కరించారు. మున్నూరు కాపు సంఘం నాయకులు మాసాడి శ్రీరాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ లీడర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారంలో చైర్ పర్సన్ సానుకూలంగా స్పందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నాయకులు దాసరి శ్రీనివాస్, శ్రీదేవి, ములకూరి చంద్రయ్య, విట్టల్, బాలకృష్ణ, మిట్ట చంద్రయ్య, దెబ్బటి రమేష్, సానా శ్రావణ్, కొట్టె వినయ్, డోల్కసి సత్తయ్య, శంకర్, కురుకుట్ల తిరుపతి, మాసాడి నారాయణ, లక్ష్మి, మంద అనిత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply