కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : మందమర్రి తహసీల్దార్ కార్యాలయంలో గురువారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు స్వయంగా చెక్కులను అందజేశారు.

మందమర్రి మండలం, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎంపికైన లబ్ధిదారులకు ఈ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలపై పెళ్లిళ్ల ఆర్థిక భారం తగ్గించేందుకే రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోందని తెలిపారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, వివిధ శాఖల అధికారులు, పార్టీ నాయకులు, డిసిసి ప్రెసిడెంట్ పిన్నింటి రఘునాథరెడ్డి, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply