Mudhole | పట్టుదలతో లక్ష్యంపై దృష్టి సారించాలి

Mudhole | పట్టుదలతో లక్ష్యంపై దృష్టి సారించాలి
- జిల్లా ప్రధాన కార్యదర్శి పురావస్తు గోపాల కిషన్
Mudhole | ముధోల్, ఆంధ్రప్రభ : విద్యార్థులు పట్టుదలతో లక్ష్యంపై దృష్టి సారించాలని శ్రీ సరస్వతి శిశు మందిర్ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పురావస్తు గోపాల కిషన్ పేర్కొన్నారు. ఈ రోజు ముధోల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పోషకుల అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ…. వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు పాఠశాలకు హాజరు కావాలని, రోజు వారిగా నిర్వహిస్తున్న స్థాయి నిర్ధారణ పరీక్షలను పూర్తి ఆత్మవిశ్వాసంతో రాయాలని అన్నారు.

నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షులు ధర్మపురి సుదర్శన్ మాట్లాడుతూ… విద్యార్థులకు మొబైల్ ఫోన్లకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉంచాలని అన్నారు. విద్యార్థులు అన్ని విషయాలలో ప్రదర్శనలు ప్రదర్శించారు. విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని అన్నారు. పలువురు పోషకులు మాట్లాడుతూ… తమ పిల్లల చదువుపై సలహాలు సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు కొండవార్ సంజీవ్ కుమార్, పాఠశాల కార్యదర్శి వేద్ పాఠక్ నిశికాంత్ , ప్రధానోపాధ్యాయులు సారథి రాజు, పోషకులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.


