హనుమకొండ వికలాంగుల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా శ్రీకాంత్

హనుమకొండ, ఆంధ్రప్రభ : నవ తెలంగాణ రాష్ట్ర వికలాంగుల ఫోరం హనుమకొండ జిల్లా అధ్యక్షులుగా కాజీపేట చెందిన ఇప్ప శ్రీకాంత్‌ను రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి. అజీమ్ ఆధ్వర్యంలో శనివారం నియమించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి. అజీమ్ మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలుగా దివ్యాంగులు సాధారణ ప్రజల సమస్యలకు అండగా నిలిచి, అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిన ఇప్ప శ్రీకాంత్ సేవలను గుర్తించి అందజేశామని తెలిపారు.

సంఘం నియమ నిబంధనలు కఠినంగా పాటిస్తూ, ఎలాంటి అవినీతి లేదా అక్రమాలకు పాల్పడకుండా, స్వచ్ఛంద సేవా భావనతో దివ్యాంగులకు సహాయ సహకారాలు అందించాలి. వారి సమస్యల పరిష్కారంలో నిరంతరం కృషి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మండల వేణుగోపాల్, రాష్ట్ర సహాయ కార్యదర్శి బండారి మహేందర్, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు బండి చక్రపాణి, వరంగల్ జిల్లా అధ్యక్షులు గై సతీష్, ప్రధాన కార్యదర్శి బత్తిని రాజు, ఉపాధ్యక్షులు వేల్పుల ప్రభాకర్, కార్యదర్శి ఎం.డి. సాదిక్, క్రాంతిభరత్ రాజ్ భారత్, సమ్మడి మధు, ఎం.డి. బిలాల్ (బబ్బులు) తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply