కేటీఆర్ పర్యటన అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధం
- బీఆర్ఎస్ నాయకుడు, 40వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి
కరిమాబాద్, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) కన్నెపల్లి పంప్‌హౌస్ పరిశీలనకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడం, ఆయనకు సంఘీభావంగా వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని బీఆర్ఎస్ నాయకుడు, 40వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి విమర్శించారు.
ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రజలు విసుగు చెందడంతో బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ పెరుగుతోందని అన్నారు. దీనిని తట్టుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని ఆరోపించారు.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ విధానాలను, అవినీతిని ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని చెప్పారు. అక్రమంగా అరెస్టులు చేసి కేసులు నమోదు చేసినంత మాత్రాన బీఆర్ఎస్ నాయకులు భయపడబోరని స్పష్టం చేశారు.
ఆదివారం ఉదయం 6 గంటలకే మిల్స్ కాలనీ సీఐ కర్ర స్వామి ఆధ్వర్యంలో తనతో పాటు 40వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి, నాయకులు అంకం దేవానంద్, శెట్టి మోహన్, కెంచ ఆనంద్‌లను కన్నెపల్లికి వెళ్లకుండా ముందస్తుగా అదుపులోకి తీసుకుని, అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారని తెలిపారు.
