అదుపు తప్పిన బస్సు…

అదుపు తప్పిన బస్సు…

కర్నూలు జిల్లా, ఆంధ్ర‌ప్ర‌భ‌ : మండల కేంద్రం నందవరం విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో ఆర్టీసీ బస్సు స్టీరింగ్ వీల్ తెగిపోవడంతో అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లింది. తెలంగాణ రాష్ట్రం ఐజ నుండి ఎమ్మిగనూరు వస్తున్న ఆర్టీసీ బస్సు నందవరం సబ్ స్టేషన్ సమీపంలో స్టీరింగ్ వీల్ తెగిపోడంతో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహారించి బస్సు ను పొలంలోకి తిప్పడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.

బస్సులో 18మంది సురక్షితంగా బయటపడ్డారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ సమయస్ఫూర్తిని అధికారులు, ప్రయాణికులు, ప్రజలు అందరూ అభినందించారు.

Leave a Reply