ఘనంగా పుట్టపర్తి నారాయణాచార్యులు జయంతి వేడుక…
ఘనంగా పుట్టపర్తి నారాయణాచార్యులు జయంతి వేడుక…
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాలమేరకు పుట్టపర్తి నారాయణాచార్యులు జయంతి వేడుకలు ఏ ఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించరు. ఈ సందర్భంగా డిఎస్పి చిత్రపటానికి పూలమాల వేసి ఘనముగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ… పుట్టపర్తి నారాయణాచార్యులు 1914, మార్చి 28, న చియ్యేడు గ్రామంలో జన్మించారన్నారు.
నారాయణాచార్యులు చిన్న వయసులోనే భారతం, భాగవతం, పురాణాలతోపాటు సంగీతం, వ్యాకరణం, ఛందస్సు, భరత నాట్యం తదితరాలు నేర్చుకున్నారు.సంగీతం, సాహిత్యం, నాట్యం అతనులో త్రివేణీ సంగమంలా మిళితమయ్యయన్నారు. కడపలో శ్రీ రామకృష్ణా ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేశారన్నారు. 14 భాషలు అతను బహుభాషావేత్త, తుళు, ఫ్రెంచి, పర్షియన్ లాంటి నేర్చుకున్నారు. ఉర్దూలో హంస రాజ్ రహబ్బర్ వ్రాసిన నవలను సంఘర్షణ పేరుతో తెలుగులో అనువదించారు. అతనుకు సరస్వతీ పుత్ర బిరుదు కలదు.

ఈ ఒక్క బిరుదునే గొప్ప గౌరవంగా భావించి ఉంచుకు న్నారు.తెలుగులో అతను వ్రాసిన శివతాండవం అతనుకు ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టింది. దీనిని అనేకమంది పండితులు ఆధునిక మహా కావ్యంగా అభివర్ణిస్తారు. ఇది ఆరు భాగాలుగా ఉందన్నారు. లీప్స్ ఇన్ ది విండ్ దుర్యోధనుడి కథ ఆధారంగా వ్రాసిన “ది హీరో” ఆంగ్లంలో అతను స్వంత రచనలు. భాగవతాన్ని ఇంగ్లీషులోకి అనువదించారు. భారత ప్రభుత్వం అతనుకు పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు తో పాటు రిజర్వ్ ఇన్స్పెక్టర్లు మంజునాథ్, సురేష్ బాబు, మనోహర్ రెడ్డి, కాళీ శ్రీ చరణ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
