Iran-Allows-2-Products : ఇరాన్ ఇన్సాయత్ Andhra Prabha SPL News
Iran-Allows-2-Products : ఇరాన్ ఇన్సాయత్ Andhra Prabha SPL News
- ఎరువుల ఓడలకు ఓకే
- మందులకు అడ్డులేదు
- హోర్ముజ్ జలసంధిలో అనుమతి
- ఐరాస భేటీలో కీలక ప్రకటన
- యుద్ధం మధ్య మానవీయ చర్యలు
- ప్రపంచ ఆహార భద్రతపై ప్రభావం
- అణు కేంద్రాలపై దాడుల ఆరోపణలు
- ఐఆర్జీసీ కఠిన హెచ్చరికలు
- సంయమనం పాటించాలి : ఐరాస పిలుపు
( ఆంధ్రప్రభ, జెనీవా ప్రతినిధి)
ఎట్టకేలకూ మానవత్వానికి ఇరాన్ తలవంచింది. ఆకలి, అనారోగ్య పీడితులకు భరోసాగా.. తన ఉడుం పట్టును సడలింది. హోర్ముజ జలసంధి మీదుగా మందులు, ఎరువుల రవాణాకు అంగీకరించింది. జెనీవాలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల ప్రతినిధుల భేటీలో ఆ అంశాన్ని ప్రకటించింది. ఇజ్రాయెల్ తమపై దాడి చేసిందని, ఈ దాడుల్లో రెండు అణు కేంద్రాలు దెబ్బతిన్నాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా వెలువరిచిన కొన్ని గంటలకే ఈ ప్రకటన చేసింది.
Iran-Allows-2-Products : అన్నార్తుల కోసం ఓకే

హోర్ముజ్ జలసంధిలో మానవీయ సాయాన్ని సుభతరం , వేగవంతం చేయడానికి తాము అంగీకరించినట్టు జెనీవాలో ఐక్యరాజ్యసమితి భేటీ అనంతరం ఇరాన్ రాయబారి శుక్రవారం రాత్రి వెల్లడి చేశారు. తమ అణు కేంద్రాలపై వైమానిక దాడులు జరిగిన రోజే, ఈ కీలక జలమార్గం మీదుగా ఔషధాలు, వ్యవసాయ సరుకులను తరలించడానికి అనుమతించాలని ఐక్యరాజ్యసమితి అభ్యర్థనను తాము అంగీకరించింనట్టు ఇరాన్ రాయభారి అలీ బహ్రెయిని చెప్పారు.
Iran-Allows-2-Products : మానవత్వానికి సలాం

నెల రోజుల యుద్ధం తర్వాత ఈ నౌకా రవాణా అవరోధం ఇక ఉండదు. ఈ సహాయ ప్రణాళికతో హోర్ముజ జలసంధి మార్గం సుగమం కావటానికి తొలి ముందడుగు అవుతుంది. మార్కెట్లు , ప్రభుత్వాలు ప్రధానంగా చమురు సహజ వాయువు సరఫరాలపై నిరోధంపై దృష్టి సారిస్తుండగా, ఎరువులపై ఆంక్షలు ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతోంది.
“మానవీయ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి అవసర సహాయం ఆలస్యం లేకుండా చేరేలా చూడటానికి ఇరాన్ నిరంతర నిబద్ధతకు ఈ చర్య ప్రతిబింబిస్తుంది,” అని బహ్రెయిని ఒక పోస్ట్‌లో స్పష్టం చేశారు.సహాయ పంపిణీ, ఇరాన్ యుద్ధం పర్యవసానాలను పరిష్కరించడానికి ఐక్యరాజ్యసమితి ఇంతకుముందు ఒక టాస్క్ ఫోర్స్‌ను ప్రకటించింది. రెండు అణు కర్మాగారాలపై దాడి జరిగిందని ఇరాన్ ప్రభుత్వ మీడియా చెప్పిన కొన్ని గంటల తర్వాత ఈ ప్రకటన వెలువడింది.
Iran-Allows-2-Products : ఆగని ఇజ్రాయెల్

టెహ్రాన్‌పై తన దాడులను “ఉధృతం చేసి, విస్తరిస్తామని” ఇజ్రాయెల్ బెదిరించింది. ముడి ఖనిజం నుంచి మలినాలను తొలగించిన తర్వాత ఏర్పడే గాఢ రూపమే ఎల్లోకేక్. అణు రియాక్టర్లలో హెవీ వాటర్‌ను మోడరేటర్‌గా ఉపయోగిస్తారు. యాజ్ద్ ప్లాంట్‌లో సుసంపన్నం చేయడం కోసం ముడి పదార్థాలను శుద్ధి చేస్తారని, ఈ దాడి ఇరాన్ అణు కార్యక్రమానికి పెద్ద దెబ్బ అని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.
Iran-Allows-2-Products : అరాక్ పై దాడి నిజమే

అరాక్‌లోని షాహిద్ ఖొండాబ్ హెవీ వాటర్ కాంప్లెక్స్ యజ్ద్ ప్రావిన్స్‌లోని అర్దాకాన్ ఎల్లోకేక్ ఉత్పత్తి కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకున్నారని ఇరాన్ అణుశక్తి సంస్థ తెలిపినట్లు IRNA నివేదించింది. అరాక్ ప్లాంట్‌పై దాడి జరగలేదు. గత జూన్‌లో ఇజ్రాయెల్ దాడి చేసినప్పటి నుండి ఇది పనిచేస్తోంది. ఈ దాడులతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని కాలుష్యం సోకే ప్రమాదం లేదని అది పేర్కొంది. ఈ దాడికి ఇజ్రాయెల్ బాధ్యత వహించగా, ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ వెంటనే హెచ్చరించింది.
Iran-Allows-2-Products : ఈసారి.. కంటికి కన్ను కాదు : ఐఆర్జీసీ

ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటుందని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) హెచ్చరించినట్లు IRNA నివేదించింది. అమెరికా, ఇజ్రాయెల్‌లతో సంబంధాలున్న కంపెనీల ఉద్యోగులు తమ కార్యాలయాలను విడిచిపెట్టాలని IRGC ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ సయ్యద్ మజీద్ మూసావి Xలో పోస్ట్ చేశారు. “ఈసారి, ‘కంటికి కన్ను’ అన్నట్లు ఉండదు, వేచి చూడండి,” అని ఆయన అన్నారు. “దౌత్యం కోసం అమెరికా అధ్యక్షుడు పొడిగించిన గడువుకు ఈ దాడి విరుద్ధం,” అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇజ్రాయెల్ నేరాలకు ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకుంటోందని ఆయన వ్యాఖ్యానించారు. “
Iran-Allows-2-Products : సంయమనం పాటించండి : ఐరాస
ఇజ్రాయెల్ దాడుల వార్తలు వెలువడిన తర్వాత ఐక్యరాజ్యసమితి అణు పర్యవేక్షక సంస్థ “సంయమనం” పాటించాలన్న తన పిలుపును పునరుద్ఘాటించింది. “ఏ విధమైన అణు ప్రమాదం జరగకుండా ఉండేందుకు సైనిక సంయమనం పాటించాలన్న తన పిలుపును IAEA డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోస్సీ పునరుద్ఘాటించారు,” అని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ Xలో పేర్కొంది. ఆ ప్రదేశాలలో “బయటి ప్రాంతాలలో రేడియేషన్ స్థాయిలు పెరగలేదని” కూడా నివేదించింది.
Iran-Allows-2-Products : రాజీ చర్చలు యథాతథం

పాకిస్తాన్, టర్కీ సహా పలు దేశాల దౌత్యవేత్తలు అమెరికా, ఇరాన్ రాయబారుల మధ్య ప్రత్యక్ష భేటీకి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇక ప్రజలు, మౌలిక సదుపాయాలపై దాడులను తక్షణమే నిలిపివేయాలని ఫ్రాన్స్‌లో జీ 7 విదేశాంగ మంత్రులు కోరారు.
Iran-Allows-2-Products : సైనిక మొహరింపు మామూలే
సుమారు 2,500 మంది మెరైన్‌లను , 82వ ఎయిర్‌బోర్న్‌కు చెందిన కనీసం 1,000 మంది పారాట్రూపర్‌లను మోసుకెళ్తున్న అమెరికా నౌకలు ఆ ప్రాంతానికి సమీపించాయి. కీలక స్థానాలు విమానాశ్రయాలను సురక్షితం చేయడానికి శత్రు భూభాగంలో దిగడానికి శిక్షణ పొందిన ఈ పారాట్రూపర్‌లను మధ్యప్రాచ్యానికి పంపాలని ఆదేశాలు జారీ చేయబడ్డాయి.
ALSO READ : Us 10k Troops : అటు ఇటు Andhra Prabha Analysis
