Narendra Modi | ప్రపంచ నాలుగో అతిపెద్ద ఎయిర్ పోర్టు

Narendra Modi | ప్రపంచ నాలుగో అతిపెద్ద ఎయిర్ పోర్టు
Narendra Modi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశం ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ప్రజలపై ప్రభావం పడకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రజలు, రైతులపై యుద్ధ ప్రభావం పడకుండా కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందని ఆయన పేర్కొన్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో సమాజ్‌వాదీ పార్టీ ఈ ప్రాంతాన్ని స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుందని ఆయన విమర్శించారు. భారతీయ జనతా పార్టీ మాత్రం నోయిడాను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తూ, ఆర్థిక పురోగతికి కేంద్రంగా మార్చుతోందని ప్రధాని అన్నారు.
