Iran | ఐదుగురు భారతీయులకు గాయాలు

Iran | ఐదుగురు భారతీయులకు గాయాలు

Iran | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న వేళ, ఇరాన్ క్షిపణి దాడుల ప్రభావం యూఏఈలో కనిపించింది. అబుదాబిలో క్షిపణి శకలాలు పడటంతో ఆందోళన నెలకొంది.

గల్ఫ్ దేశాలపై ఇరాన్ చేపట్టిన క్షిపణి దాడుల నేపథ్యంలో, యూఏఈలోని అబుదాబిలో క్షిపణి శకలాలు పడిన ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఐదుగురు భారతీయులు గాయపడినట్లు స్థానిక అధికారులు ధృవీకరించారు.

యూఏఈ రక్షణ మంత్రిత్వశాఖ ప్రకారం, గగనతల రక్షణ వ్యవస్థలు ఒక బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా అడ్డుకున్నాయి. అయితే క్షిపణి శకలాలు కెజాద్ ప్రాంతంలోని రెండు ప్రాంతాల్లో పడటంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో గాయపడిన ఐదుగురు భారతీయులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి నియంత్రణలోనే ఉందని అధికారులు తెలిపారు.