అంజన్న హుండీ లెక్కింపు ప్రారంభం..
ఊర్కొండ, ఆంధ్రప్రభ ; మండల పరిధిలోని ఊర్కొండపేట గ్రామంలో వెలసిన శ్రీ పబ్బాతి ఆంజనేయస్వామి దేవాలయ హుండీ లెక్కింపు కార్యక్రమం గురువారం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ విణదరి, ఆలయ ఈవో సత్య చంద్రారెడ్డి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం ప్రారంభించారు.
సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ.. స్వామివారి బ్రహ్మోత్సవాలకు మునుపు జనవరి 2 న హుండీ లెక్కింపు కార్యక్రమం చేయడం జరిగింది ,బ్రహ్మోత్సవాలు అనంతరం తిరిగి మరల నేడు అనగా గురువారం నాటికి 82 రోజుల తర్వాత హుండీ లెక్కింపు ప్రారంభించామని ఈవో తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వహీదోద్దీన్, రవీందర్ గౌడ్, మాజీ పాలకమండలి సభ్యులు బొందయ్యా గౌడ్, ఆంజనేయులు, మల్లేష్ యాదవ్, అర్చకులు శ్రీనువాస్, ప్రవీణ్, మహేష్, సిబ్బంది మారుతి రావు ,వరలక్ష్మి, సేవ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
