పెట్రోల్ బంకుల వద్ద భారీగా రద్దీ…

పెట్రోల్ బంకుల వద్ద భారీగా రద్దీ…
గుడివాడ – ఆంధ్రప్రభ : గుడివాడలో పెట్రోల్ బంకుల వద్ద భారీగా రద్దీ నెలకొంది. బంకులు వద్ద పెట్రోల్ కొట్టించుకునేందుకు వాహనదారులు బారులు తీరాయి. అవసరానికి మించి క్యాన్లు, టిన్నులతో పెట్రోల్ కొనుగోలు చేస్తున్నారు. కొందరు బంకు నిర్వాహకులు నో స్టాక్ అంటూ బోర్డులు పెట్టడంతో వాహనదారులు ఆందోళన చెందారు.
తెరిచి ఉన్న బంకుల వద్దకు అంతకంతకు వాహనదారుల రద్దీ పెరుగుతుంది. అధికారులు చొరవ తీసుకొని సమస్య పరిష్కార మార్గం చూడాలంటూ కోరుతున్నారు. రోజు వారి కంటే అత్యధిక విక్రయాలు జరగడంతోనే పెట్రోల్ కొరత ఏర్పడిందని బంకు నిర్వాహకులు తెలిపారు. ఆర్డర్ పెట్టిన పెట్రోల్ ట్యాంకులు వచ్చిన వెంటనే విక్రయాలు చేస్తామని బంకుల నిర్వాహకులు తెలిపారు.

