ఏరువాక పౌర్ణమి ఘనంగా నిర్వహించిన సర్పంచ్ వై నరసింహులు

ఏరువాక పౌర్ణమి ఘనంగా నిర్వహించిన సర్పంచ్ వై నరసింహులు

మహబూబ్‌నగర్ రూరల్, ఆంధ్రప్రభ : ఏరువాక పౌర్ణమి సందర్భంగా సోమవారం రోజు రామచంద్రపురం గ్రామంలో ఏరువాక పౌర్ణమి ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా సర్పంచ్ వై నరసింహులు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం జూన్ మాసంలో వచ్చే తొలి పండుగ ఏరువాక పున్నం మా గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మా గ్రామస్తులు కూడా వర్షాకాలంలో వచ్చే మొదటి పండుగ ఏరువాక పున్నం ప్రతి సంవత్సరం జూన్ నెలలో మొదలవుతుంది. ఈరోజు మా గ్రామంలో పండుగ రోజు బండ్లు తిప్పడం జరిగింది. రైతులు బాగుంటే.. ఊరు బాగుంటది.. ఊరు బాగుంటే మనందరం బాగుంటామని పేర్కొన్నారు.