నరేందర్ రెడ్డి పార్థివ దేహానికి మాజీ ఎమ్మెల్యే నివాళి
నరేందర్ రెడ్డి పార్థివ దేహానికి మాజీ ఎమ్మెల్యే నివాళి
- తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి
- సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్న తాటికొండ రాజయ్య
- వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి
స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ సీనియర్ నాయకులు చింతకుంట్ల నరేందర్ రెడ్డి హైదరాబాద్‌లోని అస్తర్ ప్రైమ్ హాస్పిటల్‌లో అనారో గ్యంతో చికిత్స పొందుతూ మరణించారు.
విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య మంగళవారం ఉదయం వారి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నరేందర్ రెడ్డితో ఉన్న తన సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఎంతో ఆత్మీయత కలిగిన నాయకుడని తెలిపారు. ప్రజలతో మమేకమై పనిచేసిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని అన్నారు. ఆయ న మృతి స్టేషన్ ఘన్ పూర్ ప్రాంతానికి తీరని లోటని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నరేందర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరా లని ఆకాంక్షించారు.అనంతరం రేపు స్టేషన్ ఘన్‌పూర్‌లో జరిగే అంత్య క్రియల్లో డాక్టర్ తాటికొండ రాజయ్య పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.
