పంటల్లో యజమాన్య పద్ధతుల పాటించాలి

పంటల్లో యజమాన్య పద్ధతుల పాటించాలి

  • శాస్త్రవేత్త విజయభాస్కర్

హసన్ పర్తి, ఆంధ్రప్రభ : పంటల యజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు పొందవచ్చునని జిల్లా వ్యవసాయ సలహా సాంకేతిక పరిజ్ఞాన శాస్త్రవేత్త విజయ భాస్కర్ సూచించారు.జీడబ్ల్యూఎంసీ పరిధిలోని వంగపహడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రైతులకు.. రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో నైపుణ్య అభివృద్ధి, సామర్ధ్య పెంపుదల, మద్దతు సేవలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా విజయ భాస్కర్ రైతులకు తప్పనిసరిగా యజమాని పద్ధతులపై అవగాహన అవసరమని అన్నారు. విత్తనోత్పత్తి ఎలా చేపట్టాలో వివరించారు. వ్యవసాయాంత్రికరణలో భాగంగా ఆధునిక పరికరాలు సబ్సిడీలో పొందవచ్చునని వివరించారు. శాస్త్రవేత్త రాజకుమార్ మాట్లాడుతూ.. రైతులు విభిన్న పంటల సాగు చేపట్టాలని తెలిపారు. కూరగాయలు, పండ్ల తోటలు,ఆయిల్ ఫామ్ వంటి పంటల సేద్యంతో ఆర్థికంగా ఎదగవచ్చని పేర్కొన్నారు,ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అడ్లూరి అనురాధ, ఏఈఓ అనూష, రైతులు పాల్గొన్నారు