విద్యార్థిని మృతదేహానికి రీ-పోస్ట్‌మార్టం

తాంసి, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా పోచంపాడ్‌లోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో 8వ తరగతి చదువుతున్న ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రానికి చెందిన విద్యార్థిని లిఖిత మృతదేహానికి మంగళవారం అధికారులు రీ-పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు.

మూడు నెలల క్రితం, డిసెంబర్ 8న అస్వస్థతకు గురైన లిఖితను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.

విద్యార్థిని మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మృతదేహాన్ని వెలికి తీసి రీ-పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.