రాములోరి ఉత్సవాలకు ఆహ్వానం..
రాములోరి ఉత్సవాలకు ఆహ్వానం..
భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : ఈ నెల 27న భీంగల్ మండలం పిప్రి లొద్ది రామన్న కళ్యాణ మహోత్సవానికి రావాలని కోరుతూ మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ని గ్రామస్తులు ఆహ్వానించారు. సోమవారం హైదరాబాద్ లో లొద్ది రామన్న ఆలయ కమిటీ, వీడీసీ సభ్యులు ఎమ్మెల్యే ను కలిశారు. లొద్ది రామన్న ఉత్సవాల ఆహ్వాన పత్రిక అందజేశారు. ఎమ్మెల్యే ను కలిసిన వారిలో మాజీ ఎంపీటీసీ శ్రీకాంత్, ఒళ్లెం రమేష్, నిమ్మల నర్సయ్య, ఉపాధి స్వామి, భీమర్తి రాజేశ్వర్ తదితరులు ఉన్నారు.
