ఇరాన్ పై అమెరికా – ఇజ్రాయిల్ అత్యంత పాశవిక దాడి…

ఇరాన్ పై అమెరికా – ఇజ్రాయిల్ అత్యంత పాశవిక దాడి…

ప్రపంచ ప్రజలు శాంతి కోరుకుంటున్నారు
ప్రజా సదస్సులో వాస్తవాలు వెల్లడించిన
అసోసియేట్ ప్రొఫెసర్ బుడ్డిగ జమిందార్

చిలకలూరిపేట టౌన్, ఆంద్రప్రభ : ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య కళ్యాణమండపంలో ఆదివారం సాయంత్రం యుద్ధం వద్దు శాంతి కావాలి అనే అంశంపై ప్రజా సదస్సు నిర్వహించడం జరిగినది. తొలుతగా బొంతా భగత్ సింగ్ సభా పరిచయం చేయగా గాత్రం భగత్ సింగ్ అధ్యక్షత వహించారు.

ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ సమితి సభ్యులు, అసోసియేట్ ప్రొఫెసర్ బుడ్డిగ జమిందార్ ప్రధాన వక్తగా పాల్గొని మాట్లాడుతూ ఇరాన్ రాజధాని టెహరాన్ అనేక నగరాలపై ఏకకాలంలో బాంబుల వర్షం కురిపించాయని అమెరికా ఇజ్రాయిల్ చేస్తున్న నరమేధములో చాలామంది ఇరాన్ పౌరులు చనిపోయినట్లు రెడ్ క్రాస్ సంస్థ ప్రకటించిందని అన్నారు.

అంతేకాకుండా యుద్ధాలు ఎందుకని, శాంతి కావాలని అన్నారు, యుద్ధాల వలన చిన్నపిల్లలు, వృద్ధులు ఆ దేశ పౌరులు మరణించటమే కాకుండా ప్రపంచంలో ఇతర దేశాలపై ఆర్థిక సంక్షోభ ప్రభావం ఏర్పడుతుందని పేర్కొన్నారు. అమెరికా ఇజ్రాయిల్ జరిపిన దాడిలో ఇరాన్ దేశ సుప్రీం లీడర్ కమేని అతని కుటుంబ సభ్యులు మరణించడం జరిగిందని తెలిపారు. సామ్రాజ్యవాద అమెరికా ప్రపంచంపై తన ఆధిపత్యాన్ని పెంచుకొని యుద్ధాలతో పట్టు సాధించుకొని ఆర్థిక వనరులను దోచుకునేందుకు చేస్తున్న వ్యూహంలో భాగమే యుద్ధాలు జరుగుతున్నాయని జమీందారు తెలిపారు.

యుద్ధాలు జరగటం వలన మానవ వినాశనం, దేశాలలో ఆర్థిక సంక్షోభం తప్ప అభివృద్ధి జరగదని అన్నారు. మరొక ముఖ్య వక్త నల్లమడ రైతు సంఘం నాయకులు డాక్టర్ కొల్లా రాజా మోహన్ మాట్లాడుతూ యుద్ధ పరిణామాల వల్ల వంటగ్యాస్, ఇంధన వనరులు కొరత ఏర్పడి అది సామాన్య ప్రజలపై పడుతుందని అన్నారు. ప్రపంచ యుద్ధాలు వాటి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని యుద్ధాలు వద్దు శాంతి కావాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య కళ్యాణమండపం కార్యదర్శి, టిడిపి నాయకులు చేవూరి కృష్ణమూర్తి, సిపిఎం పార్టీ నాయకులు పేరుబోయిన వెంకటేశ్వర్లు, టిడిపి నాయకులు షేక్ జమాల్ బాషా, సామాజికవేత్త మాదాసు భాను ప్రసాద్, సీనియర్ జర్నలిస్ట్ దార్ల బుచ్చిబాబు, నాయకులు పేలూరి రామారావు, నాయుడు శివకుమార్, షేక్ ఖాదర్ వలీ, గాత్రం గగారిన్, బొంతా బ్యాంకు శేషయ్య, ప్రజా రచయిత షేక్ కరిముల్లా, ప్రైవేటు ఉపాధ్యాయ సంఘం నాయకులు షేక్ జాఫర్, మూసా బోయిన వెంకటేశ్వర్లు, విద్యార్థి యువజన సంఘం నాయకులు మెగావత్ సాయి నాయక్, జెంరాజుపల్లి అఖిల్, బొజ్జ జాషువా, దాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply