వరి దాన్యం కొనుగోలు కేంద్రంలో పాత బుక్ కీపర్ ను నియమించాలి

వరి దాన్యం కొనుగోలు కేంద్రంలో పాత బుక్ కీపర్ ను నియమించాలి

  • తాసిల్దార్ కు వినతి పత్రం సమర్పన

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : కౌలాస్ గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరిదాన్యం కొనుగోలు కేంద్రంలో పాత బుక్ కీపర్ ను నియమించాలని కోరుతు గ్రామసర్పంచ్ విద్యబలరాం,రైతులు, గ్రామస్తుల సంతకాలతో కూడిన వినతిపత్రన్నీ గురువారం నాడు గ్రామ సర్పంచ్ భర్త బలరాంసార్,రైతులు మంత్రి సాయిలు,సయ్యద్ అన్వరుల్లాహ్,బి.గంగాధర్ తాసిల్దార్ పీ.మారుతికి సమర్పించారు.

గతంలో విశ్వనాథ్ పంతులు అనే వ్యక్తి 8సంవత్సరాలుగా బుక్ కీపర్ గా ఉంటూ వరిధాన్యం రైతులకు మెరుగైన సేవలు అందించడం జరిగిందని, కక్షపూరితంగా కొందరు అతనికి బదులు ఈసారి వేరే వ్యక్తికి నియమించడం జరుగుతుందని, కావున పాత బుక్ కిపర్ నియమించాలని వారు ఆ వినతిపత్రంలో కోరారు.ఇతర వ్యక్తికి బుక్ కిపర్ గా కౌలాస్ గ్రామంలోని చాలామంది రైతులు, గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారని,కావున పాత బుక్ కీపర్ ను నియమించాలని వారు కోరారు.