సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది, పోలీసులు

సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది, పోలీసులు
గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ టూ టౌన్ పరిధిలోని బేతవోలు ఫ్లైఓవర్‌పై సోమవారం ఉదయం 10 గంటల సమయంలో ఎలక్ట్రిక్ ఓలా స్కూటీకి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. టీజీ 08 కే 6599 నంబరు గల స్కూటీ బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది. స్కూటీపై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు సురక్షితంగా బయటపడడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.



