నిరుపేద కుటుంబానికి అండగా సర్పంచ్ కాటం వెంకటేశం

చిట్యాల, ఆంధ్రప్రభ ; గ్రామంలో ఎవరికీ ఆపద వచ్చిన నేనున్నానంటూ ముందుకు సాగుతున్న పెద్ద కాపర్తి గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆదివారం నాడు నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో నిరుపేద తోటకూరి ఎల్లయ్య అనారోగ్యంతో మృతి చెందాడు.
సర్పంచుల ఫోరం అధ్యక్షులు గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం ఎల్లయ్య నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించడం జరిగిందని గుర్తు చేశారు.
ముందు కూడా కుటుంబానికి ఏ అవసరం ఉన్న తన దృష్టికి తీసుకురావాలని కుటుంబ సభ్యులను కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, మాజీ ఉపసర్పంచ్ ఏర్పుల నరసింహ, వార్డు సభ్యులు సాగర్ల నాగరాజు, ఆమనగంటి నరేష్, కురు యాదయ్య, ఏర్పుల వెంకన్న తదితరులు ఉన్నారు.
