‘కాఫీ విత్ క్యాడర్’ కార్యక్రమం…

‘కాఫీ విత్ క్యాడర్’ కార్యక్రమం…

గ్రామ ప్రజలను పలకరించిన ఉషశ్రీ చరణ్

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రంలోని వడిగేపల్లి పంచాయతీ పరిధిలోని వడిగేపల్లి గ్రామంలో ఆదివారం ‘కాఫీ విత్ క్యాడర్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీమంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఉషశ్రీ చరణ్ హాజరై గ్రామ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామంలో గడపగడపకు వెళ్లిన ఆమె, ప్రతి కుటుంబాన్ని కలుసుకుంటూ వారి సమస్యలను తెలుసుకున్నారు. గతంలో జగనన్న ప్రభుత్వం ఉన్న సమయంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించామని, ప్రజలకు ఎలాంటిలోటు లేకుండా పాలన సాగించామని గుర్తు చేశారు.

ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ప్రజలను మభ్యపెట్టిందని విమర్శించారు. ప్రజలకు నిజ పరిస్థితులను వివరిస్తూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉషశ్రీ చరణ్ దంపతులతో పాటు గోరంట్ల మండల ప్రజాప్రతినిధులు, మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు వడిగేపల్లి పంచాయతీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.