పోచమ్మ తల్లి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు

పోచమ్మ తల్లి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు

ఏ,ఆర్ పల్లిలో, నాగదేవత విగ్రహం ప్రతిష్టాపన

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ప్రజలు ,పోచమ్మ తల్లి దేవాలయాల్లో మహిళలు బోనాలతో తరలి వెళ్లి మొక్కలు చెల్లించుకున్నారు. మండలంలోని ఎలేటి రామయ్య పల్లి పోచమ్మ తల్లి ఆలయంలో పూజారులు మృత్యుంజయ, రుద్ర దేవ్ పూజా కార్యక్రమాలు నిర్వహించి, డప్పు, చప్పుళ్ల మధ్య గ్రామస్తులు, నాగదేవత విగ్రహాన్ని ప్రతిష్టాపించారు.

అనంతరం మహిళలు బోనాలతో పోచమ్మ తల్లికి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొడారి అశోక్, ఉప సర్పంచ్ మర్రి సమ్మక్క, వార్డు సభ్యులు నాగరాజు, మైపాల్, పద్మ, రమేష్, గ్రామస్తులు, కొడారి కొమురయ్య, మర్రి నరేష్, ఏలేటి వెంకన్న, శ్రీనివాస్, పొలంపల్లి తిరుపతి, తదితరులు పాల్గొన్నారు. అలాగే మండల కేంద్రంలోని చింతలపల్లి గ్రామస్తులు బోనాలతో పోచమ్మ తల్లి దేవాలయం వరకు వెళ్లి పోచమ్మ తల్లి కి నైవేద్యంతో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కుల పెద్దలు, గ్రామస్తులు, పాల్గొన్నారు.

Leave a Reply