పాశికంటి శ్రీనివాస్ కు రాష్ట్రస్థాయి పురస్కారం..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులు, సీనియర్ నాయకులు పాశికంటి శ్రీనివాస్ కు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ( టీఆర్ పీఎస్ ) రాష్ట్ర స్థాయి ఉగాది పురస్కారం-2026 లభించింది.

తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో పద్మశాలి టెక్స్టైల్స్ లైఫ్ స్టైల్, వి ఎం ఎన్, టి ఆర్ పిఎస్, జాతీయ చేనేత ఐక్యవేదిక సంస్థలు సంయుక్తంగా సేవా రంగంలో కృషి చేసిన వారికి అందజేసే ఈ రాష్ట్రస్థాయి పురస్కారాన్ని హైదరాబాద్ ఎల్బీనగర్ కేబీఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీనివాస్ అందజేశారు.

ప్రముఖ చలనచిత్ర నటులు, మాజీ మంత్రి బాబు మోహన్ చేతుల మీదుగా ఈ అవార్డును శ్రీనివాస్ అందుకున్నారు. రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్న శ్రీనివాస్ కు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు వల్లకాటి రాజ్ కుమార్, జాతీయ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు రాపోలు వీర మోహన్, ఎక్స్పో నిర్వాహకులు ఇప్పలపల్లి రమేష్, మార్త రమేష్ శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.