శ్రీ సీతారాముల కళ్యాణం విజయవంతం చేయండి..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఊట్కూర్ మండల కేంద్రంలోని పాతపేట ఆంజనేయస్వామి దేవాలయంలో ఈ నెల 27న నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం విజయవంతంచేయాలని ఉత్సవ కమిటీ గౌరవాధ్యక్షులు సందాపురం అశోక్ కుమార్, అధ్యక్షులు మల్లేపల్లి అశోక్ పిలుపునిచ్చారు. ఆదివారం నారాయణపేటజిల్లాఊట్కూర్ మండల కేంద్రంలోని పాతపేట ఆంజనేయ స్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం కరపత్రాలు విడుదల చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తామనిశ్రీరామనవమి పురస్కరించుకొని ఈనెల 27న శుక్రవారం ఉదయం 8 గంటలకు కలశం ఊరేగింపు గోషాల ఆంజనేయస్వామి దేవాలయం నుండి పాతపేట ఆంజనేయస్వామి దేవాలయం వరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 11:40 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం నిర్వహిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర పాడి పరిశ్రమల మత్స్య క్రీడలు యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, సర్పంచు ఎం భరత్ రేణుక, ఉప సర్పంచ్ రమేష్ తో పాటు పలువురు నాయకులు హాజరుకానున్నట్లు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కళ్యాణ మహోత్సవం విజయవంతంచేయాలనికోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రవికుమార్, భగవంతు, ప్రధాన కార్యదర్శి వెంకటేష్ గౌడ్, కమిటీ సభ్యులు రమేష్, శివరామరాజు, రాము, జగన్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply